- తిరుపతిలో అనుమతించకుంటే..
- చంద్రబాబు తెలంగాణకు రావద్ద
- కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు రావొద్దని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించకపోతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అనిరుధ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రోళ్లకు మన దగ్గర ఆస్తులు కావాలట. మొన్ననే రూ. 15 వేల కోట్లు తీసుకున్నారు.. అయినా కూడా మనం ఏం అనలేదు. మన ఆస్తులు కావాలి కానీ.. తిరుమలలో మనకు హక్కు లేదట. తిరుమల ముందు తమిళనాడు వాళ్లది ఉండే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఇక్కడ తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని చెప్పి.. తిరుమలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం జరిగింది.
మనం విడిపోయాక మన సిఫారసు లేఖలు చెల్లవట. కానీ మన ఆస్తులు కావాలట. ఎమ్మెల్యేలందరం కలిసి వీఐపీ లెటర్లు చెల్లేలా ఒత్తిడి తీసుకొస్తాం. లేదంటే చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు. ఆస్తుల కోసం, వ్యాపారం కోసం వస్తారు కానీ తిరుమలలో మనకు గౌరవం కల్పించరట. ఆ దేవుడే మీకు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను“ అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.