- ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
- గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తా
- కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుండగా ఈ కేసుపై మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయించిందని తెలిసి చాలా బాధ పడ్డాననన్నారు.
బిఆర్‌ఎస్ అగ్రనేతలు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు ముగ్గురు కలిసి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.