Sunday, December 29, 2024

చీకటి కోణాలు బయటపడతాయని బిఆర్‌ఎస్ నేతల డ్రామాలు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆగ్రహం
చీకటి కోణాలు బయటపడతాయని బిఆర్‌ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు బిఆర్‌ఎస్ నాయకులు వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి ఆంబోతులా తయారయ్యారని, ఆయన్ను కానిస్టేబుల్ అడ్డుకున్నా సోషల్ మీడియాలో పెట్టుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. కౌశిక్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్లను వెన్నుపోటు పొడిచారని, ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు వసూలు చేశారని, ఆఖరకు ఆయన పిఏల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

అసలు డ్రగ్స్ టెస్ట్ ఎక్కడ ఇయ్యాలో కూడా ఆయనకు తెలియదని, కొకైన్ తీసుకున్న వాడితో సంబంధం ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. కెటిఆర్ బామ్మర్ది తప్పు చేయకపోతే మీ ఎమ్మెల్యేలు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారని, కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. చీకటి కోణాలు బయటపడతాయని డ్రామాలు ఆడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో మీటింగ్ పెడితే కూడా అరెస్టులు చేశారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని, బిఆర్‌ఎస్ వాళ్లు ధర్నా చేసినా అనుమతి కూడా ఇస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com