Friday, January 17, 2025

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నాయకులు దృష్టి సారించాలి

  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి
  • మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సిఎం సమావేశం

నల్లగొండ, -ఖమ్మం,- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సిఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సిఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలని వారికి సిఎం సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని సిఎం రేవంత్ వారికి దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సిఎం రేవంత్ వారికి సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com