క్యాబినెట్ లోకి ఆయన ఎంట్రీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. క్యాబినెట్ ఎక్స్ ప్యాన్షన్ పై ఢిల్లీలో ఏఐసీసీ అగ్ర నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో మంత్రివర్గ విస్తరణపై చర్చించి కసరత్తు చేశారనే సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు.
ఐతే తెలంగాణ క్యాబినెట్ లో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో రేవంత్ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు పరిగణలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 లో భువనగిరి ఎంపీగా, ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి 2023లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ మంత్రి వర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.క్యాబినెట్ లోకి ఆయన ఎంట్రీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. క్యాబినెట్ ఎక్స్ ప్యాన్షన్ పై ఢిల్లీలో ఏఐసీసీ అగ్ర నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో మంత్రివర్గ విస్తరణపై చర్చించి కసరత్తు చేశారనే సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు.
ఐతే తెలంగాణ క్యాబినెట్ లో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో రేవంత్ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు పరిగణలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 లో భువనగిరి ఎంపీగా, ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి 2023లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ మంత్రి వర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.