Friday, December 27, 2024

శ్వేతపత్రం కాదు సోది పత్రం..

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి…

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవాస్తవాలు, తప్పుడు లెక్కలతో శ్వేతపత్రం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని అగౌరవపరిచింది. సభా గౌరవాన్ని దెబ్బతీసింది. అంతేకాదు దేశానికి మార్గదర్శిగా ఉన్న తెలంగాణ గౌరవాన్ని తగ్గించి, రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దెబ్బతీసేంది. తెలంగాణ బిడ్డగా దీన్ని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ విడుదల చేసింది శ్వేతపత్రం కాదు సోది పత్రం. గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలన్న అక్కసుతో, దుర్భుద్దితో తప్పుడు లెక్కలను అసెంబ్లీ ముందు పెట్టి రాష్ట్ర పరువును తీసింది. తప్పుడు లెక్కలున్నాయని స్వయంగా సీఎం, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అంగీకరించడమే దీనికి నిదర్శనం. అలాంటప్పుడు ఇది శ్వేతపత్రం ఎలా అవుతుంది.?
1956నుంచి బడ్జెట్ లెక్కలు, చేసిన పనులు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత పదేళ్లలో జరిగిన అభవృద్ధిని, సృష్టించిన ఆస్తులను ప్రస్తావించకపోవడం బాధాకరం. కాంగ్రెస్ నిజంగానే శ్వేతపత్రం ఇవ్వాలనుకుంటే 1956 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు తెలంగాణ వాటా ప్రకారం 41 శాతం నిధులు ఇక్కడ ఖర్చు చేశారో లేదో కూడా శ్వేతపత్రంలో వెల్లడించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. అంతేకాదు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి ప్రస్తావించలేదు. కేవలం తమకు అనుకూలంగా ఉన్న లెక్కలు, వాటిని కూడా మానిప్యులేట్ చేసి, చివరకు కాగ్ రిపోర్టులో ఉన్న అంకెలను సైతం తప్పుగా చూపిస్తూ తప్పుడు లెక్కలను అసెంబ్లీలో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది. రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర పరిస్థితిపై తప్పుడు ప్రచారాలు చేసుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి.? అంటే పెట్టుబడులు రావొద్దు. ఉన్న పెట్టుబడులు వెళ్లిపోవాలి. రాష్ట్రం పూర్తిగా నాశనం కావాలి. అనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని అనుకోవాల్సి వస్తున్నది.
అంతేకాదు.. శ్వేతపత్రం అంటే ఉన్న సదభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గంగలో కలిపేసింది. భవిష్యత్ లో శ్వేతపత్రం అంటేనే ఓ చెత్తపేపర్ అనేలా కాంగ్రెస్ చేసింది. భవిష్యత్ లో ఎవరైనా శ్వేతపత్రం రిలీజ్ చేసినా దానిపై అనుమానపడేలా కాంగ్రెస్ పార్టీ ఒక నెగెటివ్ ముద్ర వేసింది. ఏకంగా అసెంబ్లీలో ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు అదే సభవేదికగా క్షమాపణలు చెప్పాలి. వాస్తవాలను వెల్లడించాలి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com