- మీ ఓటుతో వారిని ఔట్ చేయాలి
- ప్రజలకు అవగాహన కల్పించేలా కాంగ్రెస్ పార్టీ ట్వీట్
దేశం గెలవాలంటే ఇలాంటి ఆటగాళ్లు ఔట్ అవ్వాలని, మీ ఓటుతో వారిని ఔట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా క్రికెట్ ఆడుతున్న వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చివరి బంతి వేస్తే ప్రత్యర్ధి సిక్స్ కొడతాడు. దానికి ఎంపైర్ సిక్స్ అని రెండు చేతులు ఎత్తగా మరో వ్యక్తి ఎంపైర్ ఒక చెయ్యి కిందికి దించి ఔట్‌గా ప్రకటిస్తారు.
దీనిపై ఎలాగైనా సరే గెలవాలని, గెలిచే అవకాశం ఉన్నా లేకున్నా అధికారం ఉంది కదా నాకేం అడ్డు అని, వ్యవస్థలని మేనేజ్ చేస్తూ వ్యక్తులను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ విలువలతో ఆటాడుతున్న విలువలు లేని ఆటళ్లను ఔట్ చేసే సమయం ఆసన్నమైందని చెబుతూ, దేశం గెలవాలంటే ఇలాంటి ఆటగాళ్లు ఔట్ అవ్వాలని, వారిని మీ ఓటుతో ఔట్ చేయాలన్న సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ రాసుకొచ్చింది.