Friday, December 27, 2024

నవంబర్ 19న న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ ‘ప్రజాపాలన విజయోత్సవ సభ’

  • సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి డిసెంబర్ 7తో ఏడాది
  • దశాబ్ది నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చిన రాష్ట్రం
  • ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు
  • ప్రజా శ్రేయస్సు, వికాసమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ అమలు
  • ప్రజాపాలన విజయోత్సవ సభ వేదికగా ప్రజా సంక్షేమానికి పునరంకితమవున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • విజయోత్సవ సభ వేదికగా తన సందేశాన్ని అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి కొండా సురేఖ

ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో నవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తలపెట్టిన ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతున్నదని మంత్రి సురేఖ అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, బడుగు, బలహీన వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం సహాయం రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, రూ. 2 లక్షల రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యంగా మహిళా స్వయం సహాకయ సంఘాలకు వడ్డీలేని వేల కోట్ల రూపాయల రుణాలను అందిస్తూ వారి స్వయం సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని అన్నారు. ఇందిరమ్మ పేరు వినపడని, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పొందని గ్రామమే వుండదని మంత్రి తేల్చి చెప్పారు. ఇందిరమ్మ సంక్షేమ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెచ్చిందని మంత్రి సురేఖ తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరుగులు పెడుతున్నదని అన్నారు. ప్రజల శ్రేయస్సు, వికాసమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నిర్దేశకత్వంలో ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సమర్థ కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు. విజయోత్సవ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశానిస్తారని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com