తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ జాబితాను ఖరారు చేసింది. వామపక్ష పార్టీలు సహా 11 స్దానాలు పెండింగులో పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలోనే రేవంత్, ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్ మకాం వేసి అభ్యర్థులను ఖరారు చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మొత్తానికి, తెలంగాణలోని 45 స్దానాలకు లైన్ క్లియర్ అయినట్టు తెలిసింది. టీఎస్ న్యూస్ కు అందిన సమాచారం ప్రకారం.. పలు నియోజకవర్గాల్లో ఈ కింద అభ్యర్థులు పోటీ చేస్తారు. రేవంత్ రెడ్డి ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేస్తారు. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కూతురు విజయారెడ్డి రేసులో నిలిచారు. తండ్రి చేసిన మంచి పనుల కారణంగా ఆమెను ఓటర్లు ఆశీర్వదిస్తారనే నమ్మకం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ఉంది. ఇక ఎల్బీనగర్‌లో మధుయాష్కీ పోటీలో నిల్చోవడం కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే, ఇక్కడ బీసీలకు పెద్ద పట్టున్న నియోజకవర్గం ఇది. గత కొంత కాలం నుంచి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో.. కాస్త కష్టపడితే మధుయాష్కీ గెలిచే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పోటీ చేస్తారు. గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్‌గా, ఆ తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా వ్యవహరించిన జగదీశ్వర్ గౌడ్‌కు నియోజకవర్గంలో పట్టు ఉన్నప్పటికీ, గత పదేళ్ల నుంచి కేవలం ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితమయ్యారు. కాబట్టి, ఆయన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఓడించడం ఆషామాషీ విషయమేం కాదు. ఎందుకంటే, గత పదేళ్ల నుంచి గాంధీ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడే గాంధీని ఓడించటం అంత సులువైన పనేం కాదని స్థానికులు భావిస్తున్నారు. ఏదీఏమైనా, ఈసారి అధికంగా శ్రమించే వ్యక్తులకే ప్రజలు పట్టం కట్టే అవకాశముంది.
కూకట్‌పల్లి నుంచి బిల్డర్ బండిరమేష్ కాంగ్రెస్ నుంచి టికెట్ సంపాదించారు. అయితే, శేరిలింగంపల్లిలో రకరకాల పార్టీలను మార్చిన బండి రమేష్ కూకట్‌పల్లిలో ఏమేరకు ప్రభావం చూపిస్తారోనని స్థానికులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఓడించడం అంత సులువేం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో.. ఓటర్లు ఎవర్ని కరుణిస్తారో తెలియదు కాబట్టి, డిసెంబరు 3న విజేతలెవరో తెలిసిపోతుంది. మరి, ఏయే నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
1. పాలకుర్తి యశస్విని మేమిడిలా
2. మహబూబాబాద్ డా.మురళీ నాయక్
3. పరకాల రేవూరి ప్రకాశ్‌రెడ్డి
4. వరంగల్ వెస్ట్ నాయిని రాజేంద్రరెడ్డి
5. వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ
6. వర్దన్నపేట్ కేఆర్ నాగరాజు (ఐపీఎస్)
7. కూకట్ పల్లి బండి రమేష్
8. ఎల్బీనగర్ మధు యాష్కి
9. ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి
10. మహేశ్వరం కిచ్చన్నగారి లక్మారెడ్డి
11. రాజేంద్రనగర్ కస్తూరి నరేందర్
12. శేరిలింగంపల్లి. జగదీశ్వర్ గౌడ్
13. అంబర్ పేట్ రోహిన్ రెడ్డి
14. ఖైరతాబాద్ విజయా రెడ్డి
15. జూబ్లీహిల్స్ అజహరుద్దీన్
16. సికింద్రాబాద్ కంటోన్మెంట్ డా.జీవీ వెన్నెల
17. తాండూర్ మనోహర్ రెడ్డి
18. జడ్చర్ల అనిరుద్ రెడ్డి
19. నారాయణపేట డా. పర్నిక చిట్టెం రెడ్డి
20. మహబూబ్‌నగర్ ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి
21. భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
22. మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
23. దేవరకద్ర జి మధుసూదన్‌రెడ్డి
24. మక్తల్ వాకిటి శ్రీహరి
25. వనపర్తి డా.జిల్లెల చిన్నారెడ్డి
26. జనగాం కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
27. సిర్పూరు రావి శ్రీనివాస్
28. ఆసిఫాబాద్ శ్యామ్ నాయక్
29. ఆదిలాబాద్ కంది శ్రీనివాస్ రెడ్డి
30. ఖానాపూర్ వెద్మా బొజ్జు
31. బోథ్ వన్నెల అశోక్
32. ముధోల్ నారాయణరావు పటేల్
33. దేవరకొండ బాలు నాయక్
34. ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు
35. నిజామాబాద్ రూరల్ డా. ఆర్ భూపతిరెడ్డి
36. కోరుట్ల జువ్వాడి నర్సింగ్ రావు
37. చొప్పదండి మేడిపల్లి సత్యం
38. హుజురాబాద్ వొడతల ప్రణవ్
39. హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్
40. సిద్ధిపేట్ పూజల హరికృష్ణ
41. నర్సాపూర్ ఆవుల రాజిరెడ్డి
42. దుబ్బాక చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
43. పెనపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు
44. ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు
45. పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి