Thursday, January 9, 2025

ఈ సారి కేంద్రంలో ఇండియా కూటమిదే విజయం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు
ఈ సారి కేంద్రంలో ఇండియా కూటమిదే విజయం అని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం విహెచ్ మీడియాతో మాట్లాడుతూ తరుచూ 400 సీట్లు అంటూ మోడీ, అమిత్ షాలు దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ కావాలనే రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము ఓడిపోయే పరిస్థితి లేదని రాహుల్‌కు పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిజెపి బడా నేతలంతా విదేశాలకు పారిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిని చూసి మోడీ భయపడుతున్నారన్నారు. మోడీ పదేళ్ల పాలనలో అదానీ, అంబానీలకు మాత్రమే న్యాయం చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బిజెపి ఎక్కడా లేదని చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. ఫలితాల తర్వాత వాస్తవ పరిస్థితి వారికే తెలుస్తుందన్నారు. మోడీ వల్ల ఒక్క మంచి పని జరుగలేదని ఆయన అన్నారు. మణిపూర్‌లో మహిళల బట్టలు విప్పి నడిపిస్తే మోడీ కనీసం మాట్లాడలేదన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com