Monday, March 31, 2025

గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థులెవ‌రు?

తెలంగాణ‌లో ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఘ‌న‌విజ‌యం సాధించారు. గెలిచిన వారిలో భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ములుగు సీత‌క్క త‌దిత‌రులు విజ‌యం సాధించారు. ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌టించిన ఫ‌లితాల ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీ 35 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచింది. 29 మంది ఆధిక్యంలో ఉన్నారు. తుది ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఇంకా కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఖ‌మ్మంలో కాంగ్రెస్ 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచింది. బీఆర్ఎస్ ఒక్క సీటే గెలిచింది. న‌ల్గొండ‌లో పూర్తి విజ‌యం సాధించే దిశ‌గా అడుగులేసింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోనూ కాంగ్రెస్ అనుకున్న దానికంటే ఎక్కువే సీట్లు సాధించింది.

  • వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం పన్నెండు సీట్ల‌లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపొందింది.
  • న‌ల్గొండ‌లో కాంగ్రెస్ 11 సీట్లు, బీఆర్ఎస్ ఒక్క సీటును సొంతం చేసుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com