టీఎస్, న్యూస్: ఇటీవల Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితను ఉద్దేశించి మనీలాండరింగ్ నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. mlc kavitha arrest ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ ఈ నెల 18న సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. ఇన్నాళ్లకు నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుఖేష్ లేఖలో పేర్కొన్నారు.
‘‘నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది.. రెండోది తిహార్ క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రెండూ ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. ”అంటూ లేఖలో ప్రస్తావించాడు.
ALSO READ: కలియుగం పట్టణంలో’ పిల్లల్ని ఎలా పెంచొద్దు?
కేజ్రీ, సిసోడియాతో కవిత కుమ్మక్కు Mlc Kavitha Sukesh Chandrasekhar Chat Conversion
“ వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటికొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్కా!..నేను Whatsapp chat screenshots వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు అక్కా. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే.. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈడీ, సీబీఐ కన్‌ఫ్రంటేషన్ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను అక్కా.. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్కా.. మీ మరో సోదరుడు, అవితిని సూత్రధారి Arvind Kejriwal అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్‌లో లగ్జరీ జీవితం అందంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదల్చుకున్నా.. ‘సినిమా ఇంకా మిగిలే ఉంది’. కేజ్రీవాల్ జీ.. తదుపరి ఇక మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ.. నా సోదర సోదరీమణులకు Tihar Club తిహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నాను’’ అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.