Saturday, September 21, 2024

జమిలి ఎన్నికల ముసుగులో కుట్ర ఈ సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటు సీఎం రేవంత్​ రెడ్డి

జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్నారని, ఇలాంటి కీలక సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరనిలోటని చెప్పారు. శనివారం ఏచూరి సంస్మరణ సభలో ఆయన జీవితం, రాజకీయాల గురించి మాట్లాడిన సీఎం రేవంత్.. ఏచూరి ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అన్నారు. ఏచూరిని కలిసిన ప్రతిసారి తనకు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని చెప్పారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారని, నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి అంటూ నివాళి అర్పించారు.
రాహుల్ గాంధీకి మార్గానిర్దేశకుడు
ఆయన బతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారు. మరణాంతరం కూడా ఉపయోగపడాలనే కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పది. యూపీఏ హయాంలో  పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. రాహుల్ గాంధీ ఆయనను మార్గానిర్దేశకుడిగా భావిస్తారు.  రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అన్నారు. సీతారాం ఏచూరి దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి అని సీఎం రేవంత్ కొనియాడారు. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అన్నారు.
ఫాసిస్టు విధానాలకు నిదర్శనం
మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య ఏచూరి లేకపోవడం బాధాకరమన్నారు. సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు. విద్యార్థి దశ నుంచి దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలి. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మాట్లాడితే ప్రధాని స్పందించకపోవడం వారి ఫాసిస్టు విధానాలకు నిదర్శనం. అలాంటి భాషా ప్రయోగం చేసిన వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీఎం రేవంత్ అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular