-
అమెరికాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్
-
వేగంగా విస్తరిస్తున్న కేపీ-3 కొవిడ్ మహమ్మారి
కరోనా.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంబించడం ఆందోళన కలిగిస్తోంది. తన రూపం మార్చుకుని మెల్లగా విస్తరిస్తోందీ వైరస్. తాజాగా కేపీ-3 అనే కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి రావడం అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. అందులోను కరోనా కేపీ-3 వేరియంట్ అగ్ర రాజ్యం అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నా, గతంలో కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త కరోనా వేరియంట్ సోకుతోందట.
కరోనా వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత డేంజరస్ గా మారుతోంది. కరోనా కొత్త వేరియంట్ కేపీ-3 వ్యాప్తి విషయంలో రాబోయే రోదులు చాలా కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా ఆసుపత్రుల్లో కరోనా బాధితులు అంతకంతకు పెరుగుతున్నారు. జూలై 1 నుంచి 7వ తేదీ వరకు పలు హాస్పిటల్స్ లో రోజుకు సగటున 30 కొవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
కేపీ-3 కరోనా కేసులకు సంబందించి వైద్య సదుపాయాలు, బెడ్స్ కొరత విషయంలో అమెరికాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. బైడెన్ లో కొవిడ్ కేపీ-3 వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా కేపీ-3 వేరియంట్ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.