Wednesday, September 18, 2024

వేములవాడ ఆలయంలో అవినీతి

విజిలెన్స్ కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి డొంకలు కదులుతున్నాయి. విజిలెన్స్‌ ఆరోపణల నేపథ్యంలో ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసి, మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్‌ చేస్తూ ఈవో వినోద్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్‌ అసిస్టెంట్‌కు వేతనంలో కోతకు ఆదేశాలు చేశారు. కళ్యాణ కట్టలో భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక పరిచారికను కూడా బాధ్యతలు నుంచి తప్పించారు.

ముగ్గురు పర్యవేక్షకులతోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు ఒక పరిచారికతో కలిపి 20 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2021అక్టోబర్‌లో జరిగిన విజిలెన్స్‌ తనిఖీల్లో అవినీతి బాగోతం బయటపడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular