Friday, September 20, 2024

మెరుస్తున్న తెల్ల బంగారం ! ప్రారంభంలోనే క్వింటాలు రూ.10వేలు

  • మెరుస్తున్న తెల్ల బంగారం !
  • ప్రారంభంలోనే క్వింటాలు రూ.10వేలు
  • 1.10కోట్ల హెక్టార్లకు పత్తిసాగు పరిమితం
  • 3.25కోట్ల బేళ్లకు దిగుబడి అంచనా
  • అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన డిమాండ్
  • భారత్‌కు కలిసివచ్చిన బంగ్లాసంక్షోభం

తెల్లబంగారం మెరిసిపోతోంది. సీజన్ ప్రారంభంలోనే ధరలు ధగధగలాడుతున్నాయి. పత్తి పంట ధరలు క్వింటాలుకు రూ.10వేలు పలుకు తున్నాయి. దేశీయంగా ఈ ఏడాది పత్తిసాగు విస్తీర్ణం పడిపోయింది. 1.23కోట్ల హెక్టార్లలో పత్తి సాగును ప్రభుత్వం అంచనా వేయగా , ఈ సారి 1.10కోట్ల హెక్టార్లకే పత్తిసాగు విస్తీర్ణం పరిమితమైంది. పత్తిసాగు చేస్తున్న రా్రష్ట్రాల్లో ముందువరుసలో ఉండే తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది.గతంలో 65లోల ఎకరాల విస్తీర్ణతకు చేరిన పత్తి సాగు ఒక దశలో 70లోల ఎకరాలకు కూడా చేరి రికార్డు సృష్టించింది. ఈ ఖరీఫ్‌లో 50.48లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ లక్షంగా పెట్టుకుంది. అయితే ఇందులో కేవలం 85.75శాతం మాత్రమే లక్షాలు చేరుకోగలిగింది. రాష్ట్రంలో గత ఏడాది 44.52లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరగ్గా, ఈ ఏడాది 43.29లక్షల ఎకరాల విస్తీర్ణతకే పత్తి సాగు పరిమితం అయింది. భారీ వర్షాల నేపధ్యంలో గుజరాత్ , మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్‌తోపాటు పత్తిపండించే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పత్తిసాగు విస్తీర్ణత తగ్గిపోయింది. ఈ ప్రభావం కూడా సాధారణంగా రావాల్సిన పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతోంది.

3.25కోట్ల బేళ్ల దిగుబడి అంచనా!

ఈ ఏడాది భారీ వర్షాలు వరదల ప్రభావం పత్తి ఉత్పాదకతపై పడింది. దేశీయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్రా, గుజరాత్ తదితర పత్తి పండించే రాష్ట్రాల్లో వరదలు పత్తిపైర్లను దెబ్బతీశాయి. విడవకుండా కురిసిన వర్షాలు , అధిక వర్షాలు పత్తిపొలాలను చిత్తడి చేశాయి. నేలలో ఎక్కువ రోజులు నీరు నిలువ ఉండటం , పొలం ఆరక పోవటంతో పూత పింద రాలిపోయింది. కాయలు కూడా నల్లగా మారాయి.దీంతో పత్తిదిగుబడిపై పెద్ద ప్రభావం పడుతోంది. దేశీయంగా ఈ సారి పత్తి పంట దిగుబడి 3.25కోట్ల బేళ్లకు పరిమితం కావచ్చని కాటన్ కార్పోరేషన్ వర్గాలు అంచాన వేశాయి. గత ఏడాది పత్తి పంట 3.40కోట్ల బేళ్లు మేరకు దిగుబడి లభించింది.

యూరప్ దేశాలనుంచి భారీగా అర్డర్లు:

పత్తిపంటకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. యూరప్ దేశాలనుంచి సీజన్ ప్రారంభానికి ముందుగానే పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. యూఎస్, చైనా, బంగ్లాదేశ్ , వియత్నాం , తదితర దేశాలకు మనపత్తి అధికంగా ఎగుమతి అవుతుంది. దూది ధరలు బ్రిజిల్‌లో రూ.58వేలు, ఆఫ్రికాలో రూ.55వేలు, ఆస్ట్రేలియాలో 61వేలు, ధర పలుకుతుండగా, భారత్‌లో ఇది 58వేలకు చేరింది. పత్తి గింజల ధరలు కూడా క్వింటాలు రూ.4వేలకు చేరాయి. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కూడా మనదేశ పత్తి మార్కెట్‌కు కలిసి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. పత్తి దిగుబడి తగ్గుతుందన్న ముందస్తు అంచనాలు అంతర్జాతీయంగా జౌళిపరిశ్రమ వర్గాలను కలవరపెడుతున్నాయి. సీజన్‌లో హుషారు పడి అవసరమైన మేరకు పత్తిని కొనుగోలు చేసుకోలేకపోతే పత్తి కొరతతో పరిశ్రమను ఏడాదంతా ఖాళీగా పెట్టుకోవాల్సివస్తుందన్న భయం కూడా వారిని పత్తి ముందస్తు కొనుగోలు ఆర్డర్ల దిశగా ప్రేరేపిస్తోందంటున్నారు. పొరుగున ఉన్న ఏపిలోని ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలు ఇప్పటికే క్వింటాలు రూ.9000 మార్కు దాటేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏపికంటే ఇక్కడి వాతావరణం , పత్తి పంట నాణ్యత వల్ల అధికంగా ధరలు పెట్టేందుకు వ్యాపారలు మొగ్గు చూపుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే పత్తి ధరలు క్వింటాలు రూ.10వేల మార్కునుంచి ప్రారంభమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Aamna Sharif latest stills

Surbhi Jyothi Glam Pics

Rashmika Mandanna New Pics

Ritu Sharma Latest Photos