యాక్షన్ హీరో సన్నీ డియోల్ నెక్స్‌ట్ లెవల్ పెర్‌ఫార్మెన్స్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి టాప్ తెలుగు నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఒకసారి స్క్రిప్ట్, కాస్టింగ్, డైరెక్టర్ అన్నీ లాక్ అయితే, డైరెక్టర్‌పై పూర్తి నమ్మకంతో సినిమాను ఫ్లోలో జరగనివ్వాలి అన్నారు. ‘జాట్’ ప్రాజెక్ట్‌లో మైత్రి, పీపుల్ మీడియా నా మీద, మా టీమ్ మీద పూర్తిగా ట్రస్ట్ పెట్టి పని చేయించడం నాకు బాగా నచ్చింది. వారిని చూసి బాంబే నిర్మాతలు చాలా నేర్చుకోవాలి” అంటూ సన్నీ వ్యాఖ్యానించారు. ఈ మాటలతో సన్నీ బాంబే నిర్మాతలపై అసంతృప్తిని చాటారా అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న లాహోర్ 1947 చిత్రం విషయంలో ఏర్పడిన ఆలస్యం ఈ వ్యాఖ్యలకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం ఫిబ్రవరిలోనే షూటింగ్ కంప్లీట్ అయ్యినా, ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్‌లోనే ఉంది.