టీఎస్, న్యూస్ :మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. రాష్ట్రంలో అమలులో ఉన్న సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నేడు జరగాల్సిన ఓట్ల లెక్కింపును అధికారులు జూన్ 2న వాయిదా వేశారు. ఫలితాలు వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో గత నెల 28న ఆ స్ధానానికి ఉప ఎన్నిక జరిగింది. 1439 మంది ప్రజాప్రతినిధులకు గాను 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ప్రజాప్రతినిధులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఫలితంగా 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్,బీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకోగా , కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి భవితవ్యాన్ని ప్రజాప్రతినిధులు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు.