Tuesday, May 13, 2025

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌

టీఎస్ న్యూస్ :జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు.పుదుచ్చెరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాధాకృష్ణ‌న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లను అప్ప‌గించారు.పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చెరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరుతూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ లేఖ రిలీజ్ చేసింది.బాధ్య‌త‌లు స్వీక‌రించిన క్ష‌ణం నుంచి నియామ‌కం అమ‌లు లోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆ రిలీజ్‌లో తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com