Thursday, November 14, 2024

చంద్రచూడు మొదట బాగానే ఉన్న తరువాత ఒక పార్టీ మసి పుసుకున్నారు

  • మగ్ధుమ్ భవన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  • న్యాయ వ్యవస్థ కి కళంకం వస్తుంది.చంద్రచూడు మొదట బాగానే ఉన్న తరువాత ఒక పార్టీ మసి పుసుకున్నారు
  • చీఫ్ జస్టిస్ ఇంటికి మోడీ ఎలా వెలుతారు.మోడీ వెళ్ళడం..చంద్రచూడ్ పిలవడం రెండు తప్పే..

కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ అయిన జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మణ రేఖ దాటకూడదు..లక్ష్మణ రేఖ దాటింది కాబట్టే సీత అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. బాబ్రీ మసీదు తీర్పు ఇచ్చిన వారికి రాజకీయ ఉద్యోగం వచ్చింది. మహారాష్ట్ర,ఝార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో మోడీ గెలిస్తే జమిలి ఎన్నికలు వెళతాడు. అంతర్గత కలహాలు సృష్టించి పాలన చేయాలని మోడీ చేస్తున్నారు.

మోడీ,అమిత్ షా ప్రజాస్వామ్య వ్యవస్థ కి ప్రమాదం కలిగేలా పాలన చేస్తున్నారు. దేశంలో అధికార,ప్రతిపక్ష పార్టీలను మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారు…ఆంధ్ర లో జగన్ కు మోడీ అండ లేకపోతే 12 ఏండ్లు బెయిల్ పై బయట ఎలా తిరుగుతారు. చంద్రబాబుతో మోడీ విషపు కౌగిలి లో ఉన్నాడు. కుల గణన అనేది దేశానికి అవసరం.

మేము కులాలకు మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్లము కానీ ఇప్పుడు కుల గణన కోసం పోరాటం చేయక తప్పడం లేదు. కులాల మీద మతాల మీద అభిమానం ఉండాలి..కానీ కుల తత్వం,మత తత్వం ఉండకూడదు. కుల గణన లో 72 ప్రశ్నలు ఎందుకు. మనిషికి ఆర్థిక స్థోమత ఎంత ఉంటే నీకు ఎందుకు. డిజిటల్ యుగంలో లో సర్వే లకు మనుషులని పంపడం ఎందుకు. కుల గణన చేస్తే చాలు.

వికారాబాద్ లో కలెక్టర్ పై దాడి ఊరికే చేయలేదు.. రైతులు భూములు కొల్పోతున్నారని దాడి చేశారు. మూసి ప్రక్షాళన అంటున్నారు. మళ్ళీ మూసి కంటే ఎక్కువ కాలుష్యం అయిన ఫార్మసీటీ నీ తీసుకు రావడం ఎందుకు. కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకు రావాలి.. కలెక్టర్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కానీ రైతుల బాధ ఆవేదన ను కూడా అర్థం చేసుకోవాలి.. మహిళ రైతు బాధ తో రాయి తో కొట్టింది..ఆమె పై పార్టీ ముద్ర వేసి ఆమె పై చర్యలు తీసుకోకూడదు..

కొల్లేరు ను ప్రక్షాళన చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.. అదికారంలోకి వచ్చిన పార్టీ నీ MIM కంట్రోల్ చేసినట్టు ఫిష్ మాఫీయా కంట్రోల్ చేస్తుంది.. కొల్లేరు సమస్య మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీద మాట్లాడకపోతే కదలిక వచ్చేది కావచ్చు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular