Friday, November 15, 2024

ఏచూరి జీవితంలో పది ప్రాధాన్య అంశాలు

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్నాహ్నం కన్నుముశారు. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చివరికి ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో వామపక్ష వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సభ్యులు, నేతలు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

సీతారం ఏచూరి జీవితంలో పది ముఖ్యమైన అంశాలు
1.సీతారాం ఏచూరి ఆగస్టు 12, 1952న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్, ఢిల్లీలోనే సాగింది. సీబీఎస్‌ఈ పరీక్షలో ఆయన జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

2. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. 1974లో సీతారాం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో చేరారు. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.

3.1975 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. ఆ తర్వాత పార్టీ విధానాలను కూడా రూపుదిద్ది కీలక నేతగా మారారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంతో దీనికి వ్యతిరేకంగా పోరాడిన ఏచూరి అరెస్టయ్యారు . 1978లో 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2005లో పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటు దృష్టికి ఎన్నో సమస్యలను తీసుకుచ్చి మంచి గుర్తింపును పొందారు.

4.సీపీఐ(ఎం) పార్టీ రాజకీయ ప్రభావం తగ్గిపోయినప్పటికీ.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఆ పార్టీ రాజకీయ ఉనికి లేనప్పటికీ సీతారం ఏచూరి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. భారత రాజకీయాల్లో ఆయన కీలక నేతగా ఎదిగారు. ఏచూరి నాయకత్వంలోనే 2024 ఎన్నికల్లో రాజస్థాన్‌ నుంచి మొదటి సారిగా సీపీఐ(ఎం) పార్టీ ఒక ఎంపీ సీటు దక్కించుకుంది.

5.ఏచూరికి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో పాటు మిగతా అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పార్టీల సిద్ధాంతాలు వేరయినప్పటికీ.. ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం పెంపొందించడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారు.

6.పార్లమెంటరీ చర్చలకు దారి తీసిన ఏచూరి ప్రతిపాదనలు, లౌకికవాదాన్ని నిలబెట్టేందుకు ఆయన చేసిన కృషి.. ముఖ్యంగా 2008లో ఇండియా-అమెరికా న్యూక్లియర్ ఒప్పందం వివాదంలో ఆయన చూపించిన చొరవ చెరగని ముద్ర వేశాయి. విపక్ష పార్టీల్లో ఏచూరి వాయిస్ ప్రభావవంతగా ఉండేది.

7.ఏచూరికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు వివిధ భాషల్లో ప్రావీణ్యం ఉంది. అంతేకాదు ఈయనకు ఫిడెల్ క్యాస్ట్రోతో సహా మిగతా గ్లోబల్ లీడర్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. వివిధ సిద్ధాంతాలున్న నేతలతో ఏచూరి మమేకమవ్వడం, రాజకీయ ఉపన్యాసాలు చేయడంతో బీజేపీ నేత అరుణ్‌ జైట్లీతో పాటు ఇతర సహచరుల నుంచి కూడా ఆయన ప్రశంసలు పొందారు.

8.2017లో రాజ్యసభ నుంచి ఏచూరి రిటైరయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతిస్తోందని వాదించారు. ఇక 2021లో కరోనా సమయంలో ఏచూరి కొడుకు మృతి చెందారు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు.

9. భారత్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని వ్యతిరేకించారు. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణమని ఏచూరి విమర్శించేవారు. ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఆరోపిస్తుండేవారు.

10. సీతారం ఏచూరి లౌకితత్వంపై చూపించిన నిబద్ధత వామపక్ష పార్టీ సభ్యుల్లో ఎంతగానో స్పూర్తి నింపింది. దేశ రాజకీయాల్లో వామపక్ష పార్టీ ప్రభావాన్ని పెంపొందించడంలో ఏచూరి చేసిన కృషి చిరస్మరనీయంగా నిలిచిపోతుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular