Wednesday, December 25, 2024

వామ్మో దొంగలు.. ఊర్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నయా?

రేగొండ మండల పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా జరుగుతున్న వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రేగొండ మండల కేంద్రంలో ఇటీవల రాత్రి ఇండ్లలో చోరీ జరిగింది. పెద్ద ఎత్తున బంగారు నగలు, వెండి, నగదును గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు.

రేగొండ మండలం ఆలయాల్లో పురోహిత్యం చేసుకునే అర్చకుడు ఇంటికి తాళం వేసి కుటుంబంతో హైదరాబాద్​ వెళ్లగా వారి ఇంట్లో దొంగలు పడ్డారు.గత రెండు రోజుల క్రితం గుండెబోయిన కనకయ్య ఇంట్లో చోరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆయా జిల్లాల్లో అంతర్​ రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. రేగొండ మండల పరిధిలో చోరీలకు పాల్పడుతున్నది స్థానికులా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారా తెలియడం లేదు.

పని చేయని సీసీ కెమెరాలు..

కమ్యూనిటీ పోలిసింగ్​ లో భాగంగా పోలీసుల సూచనల మేరకు దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణ సరిగా ఉండగా.. చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అటు దుంకుతూ… ఇటు దుంకుతూ కోతులు ధ్వంసం చేస్తున్నాయి. వాటి నిర్వహణ చూడాల్సిన ఏజెన్సీలు, ఆయా గ్రామ పంచాయతీలు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.

సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోతే.. ఎక్కడైనా చోరీలు జరిగిన, ఇతర అవాంచనీయ ఘటనలు జరిగినా.. నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతున్నది. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా అన్ని పంచాయతీల్లో సీసీ కెమెరాల పనితీరును స్పెషల్​ ఆఫీసర్లు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది.గత వారం రోజులుగా రేగొండ మండల కేంద్రంలో దొంగ తనలు జరుగుతున్నా సీసీ కెమెరాలు పని చేయక పోవడం దొంగలను గుర్తించలేక పోతున్న పోలీసులు.ఇప్పటికైనా సీసీ కెమెరాల పునరుద్ధరణ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com