Monday, April 21, 2025

అయ్యో పాపం..!! నిండు చూలాలి క హత్య చేసిన దుర్మార్గుడు!

నిండు చూలాలి కడుపు మీద కూర్చుని హత్య చేసిన దుర్మార్గుడు!

అనుమానం అనే పెనుభూతంతో హైదరాబాద్‌ లోని కాచిగూడకు చెందిన సచిన్‌ అనే వ్యక్తి 7 నెలల గర్భవతి అయిన భార్య స్నేహను హతమార్చడు. ఆమె పొట్ట మీద కూర్చుని ఊపిరాడకుండ చేయడంతో తల్లి చనిపోగా.. శిశువు కూడా బయటకు వచ్చి చనిపోయింది. ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్య అది కూడా ఏడు నెలల గర్భవతి అని చూడకుండా హింసించి ప్రాణాలు తీశాడు. దీనికి అంతటికి కారణం అనుమానం అనే పెనుభూతం. ఈ అనుమానపు రాక్షసి వల్ల ఓ నిండు చూలాలు, ఆమె కడుపులోని బిడ్డ కూడా ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చుని భర్త హింసించడం వల్ల గర్భస్థ శిశువు కూడా బయటకు వచ్చి చనిపోయింది. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్‌ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 18వ తేదీన చోటుచేసుకుంది.

మొదట దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అవి హత్యేనని తేల్చారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తీసుకుని వెళ్లారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌, సబ్​ ఇన్​స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్‌ సత్యనారాయణ (21)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కాప్రాకు చెందిన స్నేహ(21) అనే యువతితో పరిచయం అయ్యింది. 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తొలుత సచిన్‌ సత్యనారాయణ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. 2023వ సంవత్సరంలో వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్‌ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడు. ఈ క్రమంలోనే తన బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేసేందుకు రూ.లక్షకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య స్నేహ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బిడ్డను కాపాడి తిరిగి తల్లి వద్దకు చేర్చారు. ఆ తరువాత ఆరోగ్య సమస్యతో ఆ బాబు మృతిచెందాడు. వరుస ఘటనలు, వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కొన్నినెలలుగా దూరంగా ఉన్నారు. కాప్రాలో ఓ రూం అద్దెకు తీసుకుని గతేడాది డిసెంబరు 11 నుంచి మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే, భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్‌ గర్భం ఎలా దాల్చావంటూ ఆమెను అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెను చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు.ఈ నెల 15వ తేదీన రాత్రి భార్యకు ఫుల్లుగా మద్యం తాగించాడు. 16న ఉదయం 5 గంటల సమయంలో భార్య పొట్ట పై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. మీద కూర్చుని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న గర్భస్థ బిడ్డ కూడా బయటకొచ్చి చనిపోయింది.

అనంతరం నిందితుడు ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వంటగదిలోని గ్యాస్ సిలిండర్‌ను తీసుకొచ్చి గ్యాస్‌ లీకయ్యేలా పైపును బయటకు తీసి పరారయ్యాడు. అయితే సిలిండర్‌లో గ్యాస్‌ అయిపోవడంతో అతడి పన్నాగం బెడిసికొట్టింది. ఈ నెల 18వ తేదీన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పరిస్థితులను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానంతో గాలించారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com