Thursday, December 26, 2024

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసిపి భోజరాజు హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు సోమవారం కేయూ క్రాస్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్ తో ధ్వంసం చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీల్లో నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించ కుండా రోడ్ రోలర్ సాయంతో రెండు వందలకు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ద్వంసం చేసారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 70 కాగా కాజీపేట 65, వరంగల్ 65 వున్నాయి.

అనంతరం ట్రాఫిక్ ఎసిపి మాట్లాడుతూ సిపి అదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి తనీఖీలు చేపట్టడం. జరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయునది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే. వినియోగించుకోవాలి, ఎవరైన వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసే వారిపై పోలీసులు తీసులు క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని.. అలాగే తమ మెకానిక్లులు కూడా ఎట్టి పరిస్థితిలో ద్విచక్రవాహనాలకు సైలెన్సర్ల మార్పుకు ప్రోత్సహించవద్దని, ఇకపైన సైలెన్సర్ల మార్పుకు సహకరించిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు: తీసుకోబడుతాయని. ఏసిపి తెలియజేసారు.
ఈ కార్యక్రమములో హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకట్, సుజాత, ట్రాఫిక్ ఎస్.ఐలు వేణు,యుగంధర్, పూర్ణచంద్రరెడ్డి,శ్రావణితో పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com