సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 లక్షల మందికి రుణమాఫీ అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటిం చడంతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని కేటీఆర్ అన్నారు. 100% రుణమాఫీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి డొల్లమాటలే అని మరోసారి తేలిపోయిందన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్న సన్నాసి మాటలు మోసం తప్ప మరొకటి కాదా అని ప్రశ్నించారు.
రాబందు ప్రభుత్వం ఉంటే రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, రేవంత్ అసమర్థత అన్నదాతలకు కోలుకోలేని శాపమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని మాయ మాటలు చెప్పి.. మరోవైపు 10 నెలల తర్వాత కూడా 20 లక్షల మందిని మోసం చేశారని మండి పడ్డారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయి పోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?? అని ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు.. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదని పేర్కొన్నారు.