- ఇది భారతదేశ ప్రతిష్టకు భంగం
- భారతీయులను వెనక్కి పంపించడంపై కాంగ్రెస్ విమర్శలు
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అమెరికా ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నవిషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అక్కడి భారతీయుల చేతికి సంకెళ్లు వేసి.. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని పేర్కొంది. ఓ భారతీయుడిగా అలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని కాంగ్రెస్ నేత పవర్ ఖేడా ఆవేదన వ్యక్తం చేశారు.
2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాడేకు అమెరికాలో ఎదురైన అవమానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2013లో న్యూయార్క్‌లో దౌత్య కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ వీసా వ్యవహారంలో ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి..అవమానించిన విషయం తనకు జ్ఞాపకానికి వొస్తోందని అన్నారు. ఆ విధంగా ప్రవర్తించినందుకు అదే సమయంలో దేశంలో పర్యటించిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలవడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వ నేతలు నిరాకరించారని అన్నారు. యూఎస్ ఎంబసీకి ఇచ్చిన అనేక ప్రోత్సాహకాలను భారత్ ఉపసంహరించుకుందని పేర్కొన్నారు.