Sunday, November 17, 2024

ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి

  • ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • దూకుడుగా ప్రచారం చేయాలి
  • కార్పొరేషన్ చైర్మన్ల సమావేశంలో
  • టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశం

ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. మంగళవారం గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి అద్భుతంగా పనిచేశారని, నియంత పాలన చేసిన బిఆర్‌ఎస్, కెసిఆర్‌ను గద్దె దించడంలో మీ పాత్ర ఉందన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుందని ఆయన చురకలంటించారు. 43 లక్షల క్రియాశీలక కార్యకర్తల్లో 40 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయన్నారు. మీలో ఎంపిలు ఎమ్మెల్యేలు కావాల్సిన వారు ఉన్నారన్నారు. ప్రభుత్వం సోషల్, ప్రాంతీయ, సీనియార్టీ, హార్డ్‌వర్క్ లాంటి వాటి ప్రాతిపదికన రాష్ట్ర చైర్మన్లు దక్కాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం, సిఎం, మంత్రులు 18 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారన్నారు. కానీ, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకొని కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రచారం చేయాలని, ఇంకా దూకుడుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

బిఆర్‌ఎస్, బిజెపిలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నాయి

కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టిందని పిసిసి చీఫ్ తెలిపారు. ఇప్పటివరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంట్, రూ. 500ల గ్యాస్, రూ. 2 లక్షల రుణమాఫీ, 30 వేల ఉద్యోగాల కల్పన, కొత్త డిఎస్సీతో 11 వేల ఉద్యోగాలు, స్పోర్ట్ వర్సిటీ, స్కిల్ వర్సిటీ, రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇచ్చామన్నారు. వాటిని జనంలోకి తీసుకుపోవాలని ఆయన ఆదేశించారు. అలాగే హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాల్లో భాగంగా బిఆర్‌ఎస్, బిజెపిలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నాయన్నారు. వీటిని మనం మన ప్రచార వేదికల మీద పెద్ద ఎత్తున చేపట్టా లన్నారు. మన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల బాగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మీ సోషల్ మీడియాతో పాటు అన్ని రకాల ఫ్లాట్ ఫాంలను ఉపయోగించి కాంగ్రెస్, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ప్రతిపక్ష పార్టీల వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular