Friday, May 2, 2025

క్రిటిక్స్‌ దమ్ముంటే నా సినిమాలు బ్యాన్‌ చేయండి

రీసెంట్‌గా విడుదలైన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ రిలీజ్‌ అయి హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ హిట్ అయిన మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన ఆ సినిమా.. ఉగాది కానుకగా విడుదలైంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి నిర్మాత నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. అయితే టాక్ కాస్త తేడాగా వచ్చినా.. మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. అలా వరల్డ్ వైడ్ గా మ్యాడ్ స్క్వేర్ అదరగొడుతోంది. ఇక ఇటీవలె నాగవంశీ పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. పెంచిన టికెట్ రేట్లు తగ్గించామని చెప్పారు. ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోయినా సీక్వెల్ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో ఆడుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై నాగవంశీ ఫైర్ అయ్యారు. తమ మూవీకి హిట్ టాక్ వచ్చిందని, కానీ కొందరు ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదని క్వశ్చన్ చేశారు. మూవీ బాగుంది కాబట్టి అంతా చూస్తున్నారని, థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. “మిగతా మూవీలు బాగోలేదు కాబట్టి మ్యాడ్ స్క్వేర్ చూస్తున్నారని కొందరు అంటున్నారు. అది కరెక్ట్ కాదని తెలుసుకోవాలి. నేను థియేటర్స్ కు వెళ్లి అబ్జర్వ్ చేశాను. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తుంది” అని చెప్పారు. కానీ ఆడియన్స్ కు అర్థమైనంతగా తప్పుడు రివ్యూస్ రాస్తున్న కొందరికి అర్థం కాలేదా అని నాగవంశీ ప్రశ్నించారు. నేను మూవీస్ తీస్తేనే మీ వెబ్ సైట్స్, ఇంటర్వ్యూలు ఇస్తేనే యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతున్నాయి” అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. తాము యాడ్స్ ఇస్తేనే సైట్స్ పనిచేస్తాయని ఆరోపించారు. అందుకే సినిమాలను చంపకండని కోరారు. సినిమా మంచిగా ఆడుతున్నా కూడా.. కంటెంట్ లేని మూవీ ఆడుతోందని తప్పుడు రివ్యూస్ ఇవ్వొద్దని చెప్పారు. సినిమాలు ఉంటే అంతా ఉంటారని, కాబట్టి అది గుర్తుంచుకొని బిహేవ్ చేయండని నాగవంశీ ఫుల్ ఫైర్ అయ్యారు. ఆందోళ‌న‌ కొందరు కలెక్షన్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫేక్ అని అంటే.. దాన్ని ప్రూవ్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. నాపై పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు చూడటం మానేయండి.. నా చిత్రాలు బ్యాన్ చేయండి.. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి.. రివ్యూస్ రాయకండి… నా నుంచి యాడ్స్ తీసుకోకండి.. నాకేం అవసరం లేదు.. నేనెలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు.. మీరు ప్రమోట్ చేస్తేనే నా సినిమా ఆడటం లేదు కదా” అని వ్యాఖ్యానించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com