పాకిస్తాన్ సైన్యం తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా వాళ్ళ యుద్ధ ధోరణి అదే విధంగా ఉంటుంది. ఓ వైపు ఎంతో మంది అమాయకల ప్రాణాలు బలిగొంటున్నారు. అంతేకాక ఆర్థికంగా నష్టపోతోంది. అయినా కూడా ఇంకా దాడులకు తెగబడుతూనే ఉంది. పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే వరకూ పాక్ కు మన:శాంతి లభించదు కాబోలు. ఈరోజు మళ్ళీ పాక్ సైన్యం అటాక్ మొదలెట్టింది. ఎయిర్ పోర్టులు, ప్రజల ఇళ్ళ మీద దాడులు చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోంది. కొంత సేపటి క్రితం రాజస్థాన్ లోని జైపూర్ విమానాశ్రయంలో పేలుడు శబ్దాలు వినిపించాయని వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే బ్లాక్ అవుట్ కారణంగా అక్కడ ఏం జరుగుతోందో తెలియడం లేదని చెప్పాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.