Wednesday, April 2, 2025

తెలంగాణ డీజీపీ పేరుతో పేక్ కాల్

హైదరాబాద్ లోని పాత బస్తి చెందిన ఓ యువకుడికి డీజేపీ ఫోటోతో కాల్ రావడంతో యువకుడు బెంబేలెత్తి పోయాడు. తనకు డీజీపీ నుంచి ఫోన్ రావడం ఏంటని కాల్ రిసీవ్ చేసి మాట్లాడాడు. అయితే అందులో అచ్చం డీజీపీ వాయిస్ లాగే ఉండటంతో సార్ చెప్పండి అంటూ ఆ యువకుడు మట్లాడాడు. అయితే ఆ యువకుడిని సైబర్ నేరగాళ్ళు బెదిరించడం మొదలు పెట్టారు.

మీ బావమరిదిని డ్రగ్స్ తో పట్టుకున్నామని, అతను నీ నెంబర్ ఇచ్చాడని తెలిపారు. అందుకే నీకు ఫోన్ చేశామన్నారు. అయితే ఆ యువకుడు నిజమే అనుకుని అదేంటి సార్ మా బావమరిది డ్రగ్స్ తో దొరకడం ఏంటి ? అని ప్రశ్నించగా అదేమీ మాకు తెలియదు. నిర్లక్ష్యం చేస్తే నీ బావమరిదిని జైలుకు పంపాల్సి ఉంటుందన్నారు. బావమరిది మీ కుంటుంబానికి అప్పగించాలంటే ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపిస్తే కేసు లేకుండా చూస్తామంటూ బెదిరించారు.

ఈ విషయం ఎవరికి చెప్పకూడదన్నారు. అయితే ఆన్ లైన్ లో డబ్బులు పంపించముంటున్నారు ఏమిటని బాధిత యువకుడికి అనుమానం వచ్చింది. డీజీపీ అయితే పోలీసులకు నా దగ్గరకు పంపుతామంటారు, కానీ ఆన్ లైన పేమెంట్ చేయమంటున్నాడు ఏంటని కాసేపు ఆలోచించాడు. దీంతో కాల్ ను మళ్లీ చూడగా పాకిస్తాన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు గ్రహించాడు. ఇదంతా సైబర్ కేటుగాళ్లు పనేనని పసిగట్టాడు.

వెంటనే ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ యువకుడి వద్దకు చేరుకుని ఫోన్ తీసుకుని పరీశీలించగా ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించారు. ఈ యువకుడికి వచ్చిన ఫోన్ నెంబర్ సహాయంతో ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు తెలంగాణ డీజీపీ ఫోటోతో సహా ఆయన పేరును కూడా వాడుకోవడంతో ఈ కేసు పోలీసులకే సవాల్ మారింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com