- తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం
- సైబర్ క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం
- వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్ సిపి మహంతి
సైబరాబాద్‌లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుపైన కేసు నమోదు చేస్తామని సీపీ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలపై వార్షిక నివేదిక- 2024ను సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. మంగళవారం డియాతో సీపీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మొత్తం 37 వేల 600 కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందన్నారు. సైబర్ క్రైలో 11914 కేసులకు గాను రూ.70 కోట్ల అమౌంట్ రికవరీ అయ్యిందన్నారు.
డిజిటల్ క్రైమ్ కూడా బాగా పెరిగిందన్నారు. 8 వేల మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు. అలాగే నార్కోటిక్ కేసులు కూడా పెరిగాయన్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ 421 కేసుల్లో 24 కోట్ల 92 లక్షల విలువ చేసే మత్తుపదార్దాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఎన్‌డీపీఎస్ కేసుల్లో 954 మందిని అరెస్ట్ చేశామన్నారు. 805 రోడ్డు ప్రమాదాలలో 842 మంది మృతి చెందారని తెలిపారు. చలాన్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డ్ కొట్టింది. చలాన్స్ ద్వారా 111 కోట్ల 81లక్షల 71వేల 245 రూపాయలు వసూలు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఎకనామిక్ కు సంబంధించి 90 కేసులలో 5 కోట్ల, 29 లక్షల ప్రాపర్టీ అటాచ్ చేశామని తెలిపారు. 541 షీ టీం కేసులు నమోదు అయ్యాయన్నారు.
సైబర్ క్రైమ్‌కు సంబంధించి జనవరి నుంచి లక్ష యాభై వేల వరకు లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వొచ్చన్నారు. లక్షా యాభై దాటితేనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. బీఎన్‌ఎస్ యాక్ట్ ఫస్ట్ ఎఫ్‌ఐఆర్ రాజేంద్రనగర్‌లో నమోదు అయ్యిందన్నారు. బీఎన్‌ఎస్ యాక్ట్ వచ్చాక మొత్తం 14 వేల 250 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని, కొన్ని బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నామన్నారు. ఈవెంట్స్ పర్మిషన్ కోసం పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.