Saturday, May 3, 2025

దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో ‘రజాకర్’

భారతదేశంలో స్వతంత్ర, ప్రభుత్వేతర, లాభాపేక్షలేని, వాణిజ్యేతర చలనచిత్రోత్సవంగా 2011 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న జరిగే ఈ ఉత్సవం, భారతీయ సినిమా పితామహుడిగా గౌరవించబడే దాదా సాహెబ్ ఫాల్కే అని ప్రేమగా పిలుచుకునే దివంగత ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే వారసత్వాన్ని గౌరవిస్తుంది. యువ, అనుభవజ్ఞులైన చిత్రనిర్మాతల నుండి వినూత్నమైన, ఆలోచనలను రేకెత్తించే, ప్రగతిశీల చిత్రాలను గుర్తించి ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ క్రమంలో ‘రజాకర్’ ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులను గెల్చుకుంది.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని 16 జిల్లాలలో విస్తరించి ఉన్న నిజాం రాజ్యాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, చాలా రాజ్యాలు ఐక్యంగా ఉండగా, నిజాం రాజ్యం మాత్రం ప్రతిఘటించింది. ‘తుర్కిస్తాన్’ పేరుతో సార్వభౌమత్వాన్ని కోరింది. అన్ని రాజ్యాల్ని భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నడుం బిగించారు. ఈ క్రమంలో ఒక ‘స్టాండ్‌స్టైల్ ఒప్పందం’ ప్రజలు నిర్ణయించుకోవడానికి ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. కానీ నిజాం మాత్రం ఖాసిం రజ్వీ నేతృత్వంలోని ప్రైవేట్ సైన్యమైన “రజాకర్”ను ఏర్పాటు చేసి బలవంతపు మతమార్పిడులు, హింసాత్మక ఆక్రమణలకు ప్రయత్నించాడు. పెరుగుతున్న అశాంతి మధ్య పటేల్ “ఆపరేషన్ పోలో”తో నిజాంను ఓడించారు. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యింది. ఈ చరిత్ర ఆధారంగానే ‘రజాకర్’ చిత్రాన్ని తీశారు. ఈ తరం యువత తమ చరిత్రను అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అవసరాన్ని గుర్తించి ఈ సినిమాను తీశారు. సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు యాట సత్యనారాయణ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక నివాళిగా “రజాకార్” చిత్రాన్ని అందంగా చిత్రీకరించారు.

రజాకార్ చిత్రానికిగాను యాట సత్యనారాయణ ప్రతిష్టాత్మక ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును అందుకున్నారు. ఆయన సూక్ష్మ నైపుణ్యం, అంకితభావం, లోతైన చారిత్రక పరిశోధనలకు నిదర్శనం. చరిత్రలో చెప్పని కథను తెరపైకి జీవం పోశారు. దర్శకుడు యాట సత్యనారాయణ రెండు, మూడేళ్లు పరిశోధించారు. 120 పుస్తకాలను విశ్లేషించి రజాకార్‌ను చాలా జాగ్రత్తగా రూపొందించారు. కె. రాఘవేంద్రరావుతో ఆయనకున్న అనుభవం ఈ ప్రాజెక్టుకు సహాయపడింది. భాష, మాండలికంలో ప్రామాణికతను నిర్ధారించింది. రచయిత, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా ప్రేక్షకులను నిమగ్నం చేసేలా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు.

దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కుశేందర్ రమేష్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది. ఇది అతని అసాధారణ సాంకేతిక ప్రతిభకు గుర్తింపు అని చెప్పుకోవచ్చు. రజాకార్ విజువల్స్ ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ప్రేక్షకుల్ని లీనమయ్యేలా, భావోద్వేగపరంగా కనెక్ట్ చేసేలా అద్భుతమైన విజువల్స్ అందించారు. యాట సత్యనారాయణ విజన్‌కు ప్రాణం పోశారు. ప్రతి షాట్ ఆలోచనాత్మకంగా రూపొందించారు.

చరిత్ర పట్ల లోతైన మక్కువ, తన జన్మస్థలం పట్ల గర్వంతో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి తెలంగాణా అన్ సంగ్ హీరోలను గౌరవించటానికి ఈ చిత్రాన్ని నిర్మించారు. బెదిరింపులు వచ్చినా, నిర్మాణంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా భవిష్యత్ తరాల కోసం వారి వారసత్వాన్ని కాపాడాలనే తన లక్ష్యంలో ఆయన అచంచలంగా ఉంటూ రజాకార్ చిత్రాన్ని నిర్మించారు. 15వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో అవార్డులను గెలుచుకోవడంతో ఆయన సంతోషంగా ఉన్నారు.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతంతో ప్రాణం పోశాడు. సన్నివేశాలను భావోద్వేగానికి గురిచేయడంలో తనదైన ముద్ర వేశాడు. పాటలు చారిత్రక కథనం, వారసత్వాన్ని ప్రతిధన్వించేలా భావోద్వేగ గాథను కలిగి ఉన్నాయి. కాసర్ల శ్యామ్, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన పాటలు, సాహిత్యాన్ని అందించారు. అనసూయ, ఇంద్రజ, ప్రేమ, రాజ్ అర్జున్, వేదిక, బాబీ సింహా, మకరంద్ దేశ్‌పాండే, తేజ్ సప్రు, చందు నాయర్ వంటి వారు అద్భుతంగా నటించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com