బాలకృష్ణ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో నాగవంశీ నిర్మాణంలో ‘డాకు మహారాజ్’ తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. అయితే ఇంత వరకూ ప్రచారం పనులు మొదలవ్వలేదు. ప్రచారం ఆలస్యమైనా పీక్స్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా డాకు మహారాజు ప్రెస్ మీట్ లో ఎక్కడెక్కడ ఈవెంట్లు నిర్వహిస్తున్నారన్నది నిర్మాత నాగవంశీ రివీల్ చేసారు. జనవరి 2న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని.. ఆ తర్వాత జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం అన్నారు. అటుపై జనవరి 8న ఆంధ్రాలోని విజయవాడ-మంగళగిరి ప్రాంతంలో అభిమానుల సమక్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట. అలాగే సినిమాకి ఎలాంటి పెయిడ్ ప్రీమియర్లు లేవు. గతంలో అనుకున్న ప్రకారమే ముందుకెళ్తున్నాము. తెల్లవారు నాలుగు గంటలకు తొలి షో పడుతుంది. బాలకృష్ణ ని నేను ఎలా చూడాల నుకున్నానో అలా ఈ సినిమాలో చూస్తున్నాం. జైలర్ సినిమా చూసిన తర్వాత ఓ హీరోని ఇలా కూడా చూపించొచ్చా? అనిపించింది. అప్పటి నుంచి నాకు హీరోని తెరపై అలా చూపించాలనే ఆశ కలగింది.