Wednesday, December 25, 2024

Chinni Lyric Video, Daaku Maharaaj ‘డాకు మహారాజ్’ సెకండ్‌ సింగిల్‌ చిన్ని

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’కి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతం చిన్ని విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘డాకు మహారాజ్’కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైంది.

ఇక ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ-తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైంది. చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన “నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే. నువ్వు నవ్వుతుంటే అమావాస్యయినా దీపావళిగా మారాలే.” వంటి సున్నితమైన, సుమధురమైన పంక్తులు కట్టి పడేశాయి. తన మధుర గాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు.

Chinni Lyrical video లిరికల్ వీడియోని గమనిస్తే అద్భుతమైన విజువల్స్, విశ్వ రఘు ఆకట్టుకునే కొరియోగ్రఫీ చిన్ని పాటకు జీవం పోశాయి. బాలకృష్ణ, చిన్నారి మధ్య భావోద్వేగ మరియు ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటీ నేపథ్యంలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పాప క్షేమం, సంతోషం కోరే రక్షకుడిగా బాలకృష్ణ ఈ ‘చిన్ని’ గీతంలో కనిపిస్తున్నారు. అలాగే లిరికల్ వీడియోలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘చిన్ని’ అనే ఈ మధుర గీతం బాలకృష్ణపై కుటుంబ ప్రేక్షకులకు, ఈ తరం పిల్లలకు ఉన్న అభిమానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అటు పిల్లలు, ఇటు పెద్దలు మెచ్చేలా ఈ పాట ఉంది.

Dakumaharaj ‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com