Friday, February 21, 2025

డాకుమహరాజ్‌లో ఊర్వశిసీన్స్‌ మిస్సింగ్‌…?

బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహరాజ్‌. ఈ చిత్రం మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌చేయడానికి ఈ చిత్రం సిద్ధమయిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నెట్ ఫ్లిక్స్.. ఇటీవల పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో ఊర్వశి పిక్‌ కనిపించలేదు. దీంతో పిక్‌ పోస్ట్‌ చేశారు. మరి ఇప్పుడు చూస్తే ఏఖంగా సినిమాలో ఆమె నటించిన సీన్స్‌ను కూడా తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఊర్వశి వివాదాస్పద వ్యాఖ్యలే కారణంగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే డాకు మహారాజ్ లో కీలక పాత్ర పోషించి స్పెషల్ సాంగ్ తో సందడి చేసిన ఆమె.. ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది. మూవీపై బజ్ క్రియేట్ అవ్వడంలో తన వంతు పాత్ర పోషించింది. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ ఈవెంట్ లో సైఫ్ అలీఖాన్ దాడిపై పై స్పందించాల్సిందిగా మీడియా కోరింది. డాకు మహరాజ్ సక్సెస్ కావడంతో తన తండ్రి రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారని చెప్పింది. అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్‌గా ఇచ్చిందని తెలిపింది. కానీ, వాటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదని.. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. దీంతో అప్పుడు ఫుల్ గా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత తాను అలా అన్నందుకు సిగ్గుపడుతున్నానని, తనను క్షమించమని కోరింది. సైఫ్‌ పై దాడి దురదృష్టకరమని చెప్పింది. ఇక నెట్ ఫ్లిక్స్.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సీన్స్ ను నెట్ ఫ్లిక్స్ తొలగించిందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com