Friday, December 27, 2024

దాడి వెన‌క ప‌ట్నం

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు
ప్ర‌ధాన నిందితుడికి గులాబీ నేత‌ల‌తో సంబంధాలు
ఘ‌ట‌న‌కు ముందు నుంచి 43 సార్లు ఫోన్ కాల్స్‌
మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డితో ట‌చ్‌

వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ జిల్లా ఎస్పీ, కలెక్టర్ హైదరాబాద్ రావాలని పిలుపు ఇచ్చింది. అస‌లు ఘ‌ట‌న‌పై కూపీ లాగుతున్నారు. ఉన్న‌ఫ‌ళంగా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ వేదిక‌ను ఎందుకు మార్చిన‌ట్లు అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఈ దాడి వెన‌క గులాబీ నేత‌లున్నట్లు బ‌యట ప‌డుతున్న‌ది. మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం సేకరణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం లగచర్ల గ్రామంలో గ్రామ సభ రణ రంగాన్ని తలపించింది. గ్రామస్తుల ముసుగులో బీఆర్ఎస్‌కి యూత్ వింగ్ నాయకులు ఎంటరై అధికారులపై దాడికి పాల్పడ్డారు. కార్లను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి వెంకట్‌రెడ్డిలపై దాడులు చేశారు. ఇక్క‌డి నుంచి కలెక్టర్ తప్పించుకోగా, పలువురు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించారు.

న‌రేంద‌ర్ రెడ్డి అనుచ‌రుడు సురేష్‌
ఈ దాడి వెన‌క ప్ర‌ధాన సూత్ర‌దారి సురేష్‌గా గుర్తించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటుగా ప‌లువురు అధికారులను ల‌గిచ‌ర్ల‌కు తీసుకువెళ్ల‌డంలో ప్ర‌ధానంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా తేలింది. ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న సురేష్‌.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తించారు. దాడికి కొన్నిగంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడాడు. ఓ వైపు సురేష్‌తో మాట్లాడుతూ, మరోవైపు 6 సార్లు కేటీఆర్‌తో ఫోన్లో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి మాట్లాడిన‌ట్లు ఫోన్ కాల్ డేటా ప్ర‌కారం తేలింది. దీంతో ఈ దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఇక‌, సురేష్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులున్నాయి. చెల్లి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు రేప్ కేసు నమోదైంది. ఆయనపై కేసులు తొలగించేలా పట్నం నరేందర్‌రెడ్డి సహాయం చేసినట్టు తెలుస్తోంది.
ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వ‌చ్చిన క‌లెక్ట‌ర్ తో పాటు అధికారుల‌పై దాడి చేసేలా జనాలను సురేష్‌ రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

స్వ‌చ్చంధంగా ఇచ్చారా..?
వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌పై స్థానిక ప్రజలు దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాదు కలెక్టర్, అధికారులకు సంబంధించిన మూడు కార్లను ప్రజలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో గ్రామంలో తీవ్ర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించాగా.. అందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీంతో కలెక్టర్, రెవెన్యూ అధికారులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com