-
రోజూ శృంగారం మంచిదే
-
అనారోగ్యం దరిచేరదు.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది
శృంగారంవల్ల మధురమైన అనుభూతి, అమితానందం, ఉత్సాహం, ఉల్లాసం చేకూరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటికి మించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా శృంగారంవల్ల కలుగుతాయట. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంపతులకు వైద్యుల అవసరమే రాదట. ఎందుకంటే ఆ దంపతుల ఆరోగ్యం అంత బాగా ఉంటుందట. మరి నిత్య శృంగారంవల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనేలేమిలో, సెక్సాలజిస్టులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ శృంగారంలో పాల్గొనడంవల్ల మానసిక ఒత్తిడి దూరమైపోతుందని వైద్యులు చెబుతున్నారు. దాంతో మెదడు చురుగ్గా పనిచేస్తుందని, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుం దని, శృంగారంవల్ల సంతృప్తి మాత్రమేగాక శరీరంలో యాంటీబాడీస్ సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు. శరీరం వివిధ రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కోవడంలో శృంగారం బాగా తోడ్పడుతుందని వెల్లడించారు. అదేవిధంగా నిత్య శృంగారంవల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయి. యూరిన్ లీకేజీ సమస్య ఉంటే తక్షణమే తగ్గిపోతుంది. శృంగారం వల్ల గుండెపోటు రిస్క్ కూడా తగ్గుతుంది. సాధారణంగా హార్మోన్‌లు బ్యాలెన్స్ తప్పడంవల్ల హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. శృంగారంవల్ల శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయని వైద్యుల బృందం పరిశీలనలో తేలింది. దాంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది
అంతేకాదు నిత్యం శృంగారంలో పాల్గొనే జంటల్లో ఆత్మవిశ్వాసం స్థాయిలు కూడా పెరుగుతాయట. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తారట. అదేవిధంగా నిత్య శృంగారం చేసేవారిలో ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయట. శరీరం చురుగ్గా పనిచేస్తుందట. నిద్రలేమి సమస్యకు కూడా నిత్య శృంగారం చక్కని పరిష్కారమట. క్రమం తప్పని శృంగారంతో నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుందట. శరీరం రిలాక్స్‌గా ఉంటుందట. అందువల్ల రోజూ శృంగారంలో పాల్గొనే జంటలు ఉల్లాసంగా ఉంటారని ఓ సర్వేలో వెల్లడైంది.