Sunday, September 29, 2024

ఇదేం పిచ్చిరా నాయనా.. డేంజర్​ స్టంట్​

సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందాలనే పిచ్చితో పిల్లలనుంచి వృద్ధుల వరకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరికొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు రీల్ కోసం ఓ యువకుడు డేంజర్ స్టంట్ చేశాడు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లిన యువకుడు.. క్షణాల్లో బస్సు ముందు పడుకోవడంతో బస్సు అతనిపైనుంచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత వెంటనే లేచి అతను పక్కకు వెళ్లిపోయాడు. అయితే ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలను లెక్కచేయకుండా ఇలాంటి స్టంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా గ్రాఫిక్స్ అని కొట్టిపారేస్తున్నారు. అతని నీడ, బస్సు వెళ్లిన తీరు, బస్సు వెనకాల వచ్చిన ఆటో, స్కూటీలను గమనిస్తే ఇది పూర్తిగా ఫేక్ అని అర్థమైపోయిందంటూ వివరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular