వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మోహన్ మేనంపల్లి దర్శకుడు. ఏప్రిల్ 25న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.ఈ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్, కల్ట్ నిర్మాత ఎస్‌కేఎస్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ ” ఎస్‌కేఎన్ స్పీచ్ విన్న తరువాత ఎమోషన్ అయ్యాను. ఎస్‌కేఎన్ మంచి మనసు నాకు తెలుసు. ఈ సినిమాను ఎంకరైజ్ చేయడానికి తాను ఓ షోను ఏర్పాటు చేస్తానని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి. నాకు సంపూ ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. సంపూతో నేను సినిమా తీసి 13 ఏళ్లు అయ్యింది. హృదయకాలేయం సూపర్‌హిట్ తరువాత సంపూ నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నాడు. నాకు ఓ కారు, ఇల్లును తాను పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కట్టి ఇప్పించాడు. నాకు సంపూ ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. సినిమా ఎన్నో మ్యాజిక్కులు చేస్తుంది. సంపూను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. తాను సంపాందించుకున్న డబ్బులో అందరికి సహాయం చేస్తుంటాడు. సంపూ నా దృష్టిలో స్టార్. ఏ రోజుకైనా మా ఇద్దరం ఒకరికొకరం ఉంటాం. ఈ సినిమా సంపూ కెరీర్‌లో మంచి విజయం సాధించాలి’ అన్నారు.
ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ” చిన్న సినిమాను ప్రమోషన్ చేయడానికి వచ్చిన మీడియాకు థ్యాంక్స్. నాకు సంపూ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఫంక్షన్‌కు వచ్చాను. సంపూకు సాయిరాజేష్ అంటే చాలా ఇష్టం. అందరూ చేస్తున్న ప్రయత్నం విజయంవంతం కావాలి. ఈ సినిమాతో సంజోష్‌కు కూడా బ్రేక్ రావాలి. కంటెంట్ నమ్మి తీసిన ఈ సినిమా ఆడితే మంచి కిక్ వస్తుంది. చిన్న సినిమాలను బాగుండాలని,ఆడాలని కోరుకునే వ్యక్తిని నేను. ఇలాంటి ఫంక్షన్‌లకు రావడం నేను గౌరవంగా భావిస్తున్నాను. సీనియర్ నటుడు బాబుమోహన్ ఈ సినిమాలో చేయడం హ్యపీగా ఉంది. ఈ సోదరా సినిమా పవన్‌కల్యాణ్ బ్రో సినిమాలా ఘన విజయం సాధించాలని, అందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను థియేటర్‌లో ఒక షో బుక్ చేసుకోని మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను. ఇలాంటి చిన్న సినిమాలను నా వైపు నుంచి ప్రోత్సాహించాలనే బాధ్యత వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అన్నారు.