ఇందులో ఆమె తమ్ముడు కూడా ఉన్నాడు. తల్లి, తమ్ముడుతో కలిసి హోటల్ లో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అయితే కేక్ కట్ చేసింది మాత్రం ఫియా కాదు.. ఆమె తల్లి. ఏదో బర్త్‌డేనో.. మరోటో కాదు.. అది విడాకుల పార్టీ.

ఎందుకంటే అసలు సెలబ్రేషన్ అంతా తల్లిదే. తన తల్లి విడాకులు తీసుకుంది. పెళ్లి అయిన ముఫ్పై ఏళ్ల తర్వాత ఆ దంపతులు విడిపోయారు. అలా విడిపోయినందుకు ఆమె ఏ మాత్రం బాధపడటం లేదు. పూర్తి స్థాయిలో ఆనందంతో ఉన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. విడాకుల పార్టీ అని కేక్ మీద కూడా రాయించుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఫియా షేర్ చేసుకున్నారు. తన తల్లి తన తండ్రితో ముఫ్పై ఏళ్ల పాటు హింసాత్మకమైన అనుబంధాన్ని భరించారని ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారని రాసుకొచ్చారు.
వైరల్ గా మారిన ఫియా పోస్టు
ఫియా పోస్టు వైరల్ గా మారింది. ఓ వైపు పాకిస్తాన్ లో యుద్ధం కారణంగా గందరగోళ పరిస్థితులు ఉంటే ఈమె ఇలా సెలబ్రేట్ చేసుకోవడాన్ని కొందరు ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై కాకుండా..మంచి చేసిందా..చెడు చేసిందా అన్నదానిపై కూడా భిన్నంగా స్పందించారు. కొంత మంది ముప్ఫై ఏళ్ల పాటు కలిసి ఉన్నారంటే వారి మద్య మంచి అనుబంధం ఉండే ఉంటుందని తాత్కలికమైన ఆనందాల కోసమో.. ఆవేశంలోనే విడిపోయి ఉంటారని జోస్యం చెప్పడం ప్రారంభించారు. అయితే ఈ పార్టీలో ఫియా తల్లి ఎక్కడా విషాదంగా లేదు. పదేళ్ల పిల్లాడు ఉన్నప్పటికీ ఆమె అత్యంత ఆనందంగా ఉన్నారని కొంత మంది గుర్తు చేసుకున్నారు.
ఇక, కొంత మంది ఆ మహిళ దారి తప్పిందని విమర్శించడం ప్రారంభించారు. ఆధునికత పేరుతో.. కుటుంబ వ్యవస్థను కాలదన్నుకుంటున్నారని కొంత మంది పాకిస్తాన్ వాసులు విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన వారు విమర్శలు చేస్తున్నా.. ఇతర ప్రాంతాల నుంచి వారు మాత్రం ఆ తల్లి, కుమార్తెల ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటున్నారు.