Monday, May 12, 2025

Daughter Kills Father: పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు

ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపిన యువతి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దొర స్వామి (62) ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందగా.. తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే వేశారు.

తల్లి నగలను సైతం ఆమెకు అప్పగించారు. అయితే హరిత మదనపల్లెకు చెందిన రమేశ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సాయి కృష్ణ అనే మరో యువకుడికి రూ.8 లక్షలు ఇచ్చింది. ఈ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటోంది.

ఈ విషయాలు తెలుసుకున్న దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయుంచుకున్నారు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమై నెల రోజులుగా తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసి చంపేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com