హైదరాబాద్: రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేటి (గురువారం) అర్ధరాత్రితో గడువు ముగియనుంది. వాహనాల పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోసారి గడువు పొడిగింపు ఉండదని గతం లోనే అధికారులు తేల్చి చెప్పారు. పెండింగ్ చలాన్ల చెల్లింపులకు నేడు (గురువారం) అర్ధరాత్రి 11:59 గంటలకు గడువు ముగియనుంది.
గతేడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింప జేసింది ప్రభుత్వం. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం గడువు పొడిగింది. ఇకపై గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది.
టూ వీలర్స్‌తో పాటు త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీని ఇచ్చింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించింది. ఇక ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని కల్పించింది సర్కార్..