Sunday, October 6, 2024

మాట్లాడుదాం.. రండి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. విభజన హామీలపై చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ, ఈనెల 6న సాయంత్రం భేటీకి సిద్ధమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధితోపాటు విభజన హామీలపై కలిసి చర్చిద్దామని సీఎం రేవంత్ ఆహ్వానించారు.​ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఈ నెల 6న ప్రజాభవన్‌ వేదికగా కలిసి చర్చిద్దామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబు అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యల పరిష్కారం అవసరమని, వాటిపై కలిసి కూలంకషంగా చర్చిద్దామని సీఎం రేవంత్‌ తన లేఖలో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి సీఎం అయిన అరుదైన నేత చంద్రబాబు అని కొనియాడారు. తెలుగురాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరమన్న ఆయన, చర్చలే పరస్పర సహకారానికి గట్టి పునాది వేస్తాయని వ్యాఖ్యానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular