Friday, April 4, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు మంగళవారం సిఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బిసిల రిజర్వేషన్లకు సంబంధించి వారిద్దరూ చర్చలు జరిపారు. రిజర్వేషన్‌లపై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని, నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని కమిషన్‌కు తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కమిషన్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు ఖరారు కోసం ప్రభుత్వం తాజాగా ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయగా, ఈ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌గా (రిటైర్డ్ ఐఏఎస్ అధికారి) బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్గా ఐఎఫ్‌ఎస్ అధికారి, బిసి గురుకులాల సెక్రటరీ సైదులును నియమించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com