ఆస్కార్ కమిటీల్లో భారతీయ ప్రతిభావంతుల పేర్లు ఇంతకుముందు వెల్లడయ్యాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2023లో సంస్థలో చేరడానికి 398 మంది ప్రముఖ కళాకారులు ఎగ్జిక్యూటివ్ లకు ఆహ్వానాలు పంపగా టాలీవుడ్ సంగీతదర్శకుడు ఎం.ఎం.కీరవాణి-పాటల రచయిత చంద్రబోస్.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సహా ఆర్టిస్టుల కేటగిరీ నుంచి రామ్ చరణ్- ఎన్టీఆర్ లకు ఈ జాబితాలో చోటు లభించింది. సాంకేతిక నిపుణుల్లో కీరవాణి-బోస్- సెంథిల్ పేర్లు చేరాయి. ఇది పాత విషయమే అయినా ఇప్పుడు అకాడమీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీపిక పదుకొనే ప్రత్యక్షం కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.
భాజీరావ్ మస్తానీలో ‘దీవానీ మస్తానీ’ పాటలో దీపికా పదుకొణె ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ని ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ పెర్ఫామెన్స్ ఆస్కార్ ఇన్ స్టా పేజీలో చేరింది. దీనికి రణవీర్ సింగ్ స్పందన అద్భుతం. తమ అభిమాన నటుడిని చూసినప్పుడు దీపికా పదుకొణె అభిమానులు ఎంతో ఎగ్జయిట్ అవుతారు. ఈసారి కూడా ఆస్కార్ ఇన్ స్టా పేజీలో చూసుకుని మురిసిపోతున్నారు. దీపికకు ఇది నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. దీవానీ మస్తానీ బాజీరావ్ మస్తానీ (భన్సాలీ దర్శకుడు) లో క్లాసిక్ సాంగ్. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా, ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషించింది. రణవీర్- దీపిక జంట రొమాన్స్ కి యూత్ ఫిదా అయింది.