Sunday, November 17, 2024

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన హీరో నాగార్జున

  • నాంపల్లి కోర్టులో కేసు వేసిన అక్కినేని నాగార్జున
  • మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారన్న నాగార్జున
  • సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్ల ఫిర్యాదు

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు నాంప‌ల్లి కోర్టులో నాగార్జున ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌మ కుటుంబ గౌర‌వాన్ని, ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేశారంటూ నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. కొండా సురేఖ‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న్‌లో నాగార్జున కోరారు. శుక్ర‌వారం నాగార్జున పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపే అవకాశం ఉంది.

Defamation case registered on Konda Surekha

‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. అబద్ధం’ అని సినీ నటుడు అక్కినేని నాగార్జున నిన్న ఎక్స్ వేదిక‌గా స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి.. సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి’ అని సూచించారు. సురేఖ వ్యాఖ్యలను బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఖండించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తమ కుటుంబం పట్ల, చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, అబద్ధమని తేల్చిచెప్పారు.

తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సినీనటుడు అక్కినేని నాగార్జున సతీమణి, నటి అకినేని అమల ఫిర్యాదుచేశారు. తన కుటుంబంపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని, తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలను వెనకి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్‌గాంధీ చొరవ తీసుకోవాలి’ అని అమల డిమాండ్‌ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular