Tuesday, February 11, 2025

హస్తిన పీఠంపై ఆమె ..? ఢిల్లీ సీఎం ఎంపికలో బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌

27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిపై ఎంపికలో కీలక అడుగులు వేస్తున్నది. సీఎం కుర్చీలో మహిళను కూర్చొబెట్టేందుకు బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాలను దక్కించుకుని.. అధికారాన్ని చేపట్టేందుకు రెడీ అయింది. అయితే, ముఖ్యమంత్రి ఎంపికే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సంప్రదాయం కాదు. గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యేలు, హైకమాండ్ కలిసి.. ముఖ్యమంత్రి సీటులో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినప్పటికీ.. ఇంకా సీఎం ఎంపికపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ నెల 13వ తేదీ తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలియనుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పర్వేష్ వర్మ. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసి మట్టికరిపించిన పర్వేష్ .. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. కేజ్రీవాల్‌ని ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులోఉన్నారనే వార్తలు బీజేపీ వర్గాల్లో బలంగా వినపడుతున్న మాట. ఇప్పటిదాకా పర్వేష్‌ వర్మ పేరు ప్రచారంలో ఉన్నా.. తాజాగా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి అవుతారంటూ కాషాయదళంలో మరో టాక్‌.

ముఖ్యమంత్రిగా మహిళ…
ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఒక మహిళా ఎమ్మెల్యేని నియమించే అవకాశాలు కనపడుతున్నాయని సమాచారం. అంతేకాకుండా ఢిల్లీలోని బలహీన వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మంత్రివర్గంలో మహిళలు, దళితులకు బలమైన ప్రాతినిధ్యం ఉంటుందంటున్నారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలంటే గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు ఉన్నారు. పూనమ్ శర్మ, నీలం పెహల్వాడ్‌, రేఖా గుప్తా, శిఖా రాయ్, షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా. గ్రేటర్ కైలాష్ స్థానం నుంచి బరిలోకి దిగిన శిఖా రాయ్.. ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను 3188 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక వజీర్ పూర్ సీటు నుంచి పోటీలో ఉన్న పూనమ్ శర్మ.. ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాకు పరాజయాన్ని బహుమతిగా అందించారు. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు. చివరిగా నాజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నీలం పెహల్వాన్.. ఆప్ నేత తరుణ్ కుమార్‌పై 29 వేల ఓట్ల తేడాతో ఘన విజయం అందుకున్నారు వీరి నలుగురిలో ఒకరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని బీజేపీ అనుకుంటున్నట్లు సమాచారం. వీరిలో ఒకరిని హస్తిన పీఠంపై కూర్చుండబెట్టే అవకాశాలున్నట్లు ఢిల్లీలో చర్చ.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com