బీజేపీ ఆరోపిస్తున్నట్లు లిక్కర్ కేసు మనీ ల్యాండరింగ్ కాదని.. అదొక పొలిటికల్ ల్యాండరింగ్ కేసులా ఉందని కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తాజగా, ఆమె విచారణ సందర్భంగా వెళుతుండగా మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ కేసు పూర్తిగా తప్పుడు కేసని.. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఫైల్ చేసిన కేసు అని విమర్శించారు. ఈ స్కాములో భాగంగా ఆరోపణలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి బీజేపీలో చేరారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈ స్కామ్‌లో భాగంగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి.. బీజేపీకి యాభై కోట్ల విరాళమిచ్చారని అన్నారు. లిక్కర్ స్కామ్ నుంచి కడిగిన ముత్యంలా బయటికొస్తానని కవిత అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. మొత్తానికి, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఆమె ఆత్మవిశ్వాసంతో కనిపించడం బీఆర్ఎస్ శ్రేణుల్ని కొంతమేరకు శాంతించేలా చేసింది. ఢిల్లీకి ఎదురొడ్డి పోరాటం చేస్తున్న ఆమెకు జాగృతి శ్రేణులు అన్నివేళలా అండగా ఉంటుండటం విశేషం.