ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది.. వెస్ట్ ఢిల్లీ లోని జనక్ పురీ, నంగ్లోయ్ లో రూ. 900 కోట్లు విలువైన 80 కేజీల కొకైన్ ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు.
ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ కన్సైన్మెంట్ ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్రువీకరిస్తూ డ్రగ్స్ రాకెట్ పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామని పేర్కొన్నారు. అలాగే అధికారులను అభినందించారు.