మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారాల బిల్లు లోకసభలో తమ సభ్యుల సంఖ్యా బలంతో సునాయసంగా నెగ్గి సోమవారం రాజ్యసభలో ఆమోదానికి ప్రవేశపెట్టింది. చర్చల అనంతరం పెట్టిన ఓటింగులో అధికారపక్షం 128 ఓట్ల అంచనాకు భిన్నంగా నాలుగు ఓట్లు అధికంగా మొత్తం 131 సాధించి బిల్లు పాస్ చేసింది. ఈ క్రమంలో రాజ్యసభలో బిల్లు చర్చపై విపక్షాలు, అధికార సభ్యుల వాదనలు ఆసక్తిగా సాగి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో స్థిరంగా ఉన్న ఆప్ ప్రభుత్వాన్ని అస్తిరపరచడం, బలహీనం చేసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఇది మోడీ ప్రభుత్వ అధికార గర్వాన్ని తెలియసీచేస్తున్నదని వాదించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను బలవంతంగా కూలాదోయాలని, అధికారలను లాక్కోవాలని చూడటం ఎక్కడి న్యాయం.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని రాజ్యసభలో దూయ్యబట్టారు. చద్దా ప్రతి అంశానికి నెహ్రు విధానంతో ముడి పెట్టకుండా ఢిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా చేస్తామని గతంలో చెప్పిన ఎల్ కే అద్వానీ , వాజపేయ్, సుష్మాస్వరాజ్ తదితరుల మాటల్ని నిజం చేయండి చాలు అన్నారు.
మోడీ మొన్నటి ఎన్నికల్లో తానే ప్రత్యక్షంగా ఢిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా మారుస్తామని తమకు ఓటు వేయమని కోరిన ఢిల్లీ ప్రజలు పెడచెవిన పెట్టిన సంగతి గుర్తుంచుకోవాలని అమితాషాకు చురకలంటించారు. డీఎంకే సభ్యులు తిరుచి శివ బీజేపీ ప్రవేశపెట్టిన “ఢిల్లీ అధికార బిల్లు”2023 సరైంది కాదు అంటూ తమ పార్టీ ఈ అంశాన్ని ఖండిస్తుందని తెలిపారు. సీపీఐ సభ్యుడు బినోయ్ విశ్వం బీజేపీ ప్రభుత్వం నాగపూర్ నుండి అందుతున్న ఆజ్ఞాల ప్రకారం పాలనా సాగించడం శోచనీయం అన్నారు. విపక్షాల సభ్యుల వాదనలకు ధీటుగా హోమ్ మినిస్టర్ అమిత్ షా సీపీఐ సభ్యునికి సమాధానంగా తమకు నాగపూర్ నుంచి అజ్ఞాలు వస్తున్నాయానుకొన్నా కొంతమంది చైనా, రష్యా ఆదేశాలకు ఎదురు చూస్తారన్నారు. బీఆర్ఎస్ సభ్యులు కేశవరావు ఎదో మాట్లాడుతున్నారని నిజానికి వారు ఢిల్లీ ప్రభుత్వంతో లిక్కర్ వ్యాపారంలో కలిసి నడుస్తున్నారని ఏకరువు పెట్టారు. ఢిల్లీ లో ప్రజాసేవలకు ఇబ్బంది కాకూడదనే తమ ప్రభుత్వం “ఢిల్లీ అధికార సవరణ బిల్లు” తెచ్చామని.. గత ప్రభుత్వాల వల్లే “ఎమర్జెన్సీ” కోసం కాదన్నారు. సభలో ఉన్న ఖర్గే లేచి అమిత్ షా మాటలకు అడ్డు చెబుతుండగా స్పీకర్ వారించారు.